వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర

  • రూ.250 తగ్గి, రూ.31,450గా నమోదైన 10 గ్రాముల పసిడి ధర
  • రూ.140 తగ్గి, రూ.39,300గా నమోదైన కిలో వెండి ధర
  • గ్లోబల్ మార్కెట్లో పసిడి ధర 0.21శాతం తగ్గి ఔన్సు 1,326 డాలర్లుగా నమోదు
బులియ‌న్ మార్కెట్‌లో ఈ రోజు బంగారం ధర తగ్గింది. పది గ్రాముల బంగారం ధర రూ.250 తగ్గి, రూ.31,450గా నమోదైంది. అంతర్జాతీయ పరిస్థితులు, డాలరు విలువ పెరగడం, బంగారం వ్యాపారుల నుంచి డిమాండ్ లేకపోవడంతో బంగారం ధర వరుసగా రెండో రోజు పడిపోయిందని విశ్లేషకులు చెబుతున్నారు.

మరోవైపు, పారిశ్రామిక వర్గాలు, నాణెల తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడతో రూ.140 తగ్గిన కిలో వెండి ధర రూ.39,300గా నమోదైంది. కాగా, గ్లోబల్ మార్కెట్లో పసిడి ధర 0.21శాతం తగ్గి ఔన్సు 1,326 డాలర్లుగా ఉంది.  
Go Back to Shorts
gold
rate
silver

More Telugu News